కెరీర్ ఆరంభంలో పూనమ్ కొన్ని చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్ కి దూరం అయింది. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోలతో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం పూనమ్ బజ్వా వయసు 39 ఏళ్ళు. కింగ్ నాగార్జున బాస్ చిత్రంలో ఒక హీరోయిన్ పూనమ్ బజ్వా నటించింది. ఆ మూవీ అంతగా సక్సెస్ కాలేదు. కానీ నాగార్జునతో కలసి బాగానే కెమిస్ట్రీ పండించింది. ఇప్పుడైతే పూనమ్ బజ్వాకి ఎలాంటి ఆఫర్స్ రావడం లేదు. పూనమ్ బజ్వాకు టాలీవుడ్ లో పెద్దగా విజయాలు లేవు. అయినప్పటికీ ఆమె క్యూట్ లుక్స్ తో కుర్రాళ్లని ఆకర్షించింది. కానీ హీరోయిన్ గా మాత్రం రేసులో వెనుకబడిపోయింది. చిన్న రోల్స్ కి మాత్రమే పరిమితమైంది. ఆ మధ్యన పూనమ్ బజ్వా ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో మెరిసింది. మళ్ళీ టాలీవుడ్ లో పూనమ్ బజ్వా ఆఫర్స్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తోంది ఈ అమ్మడు. తరచుగా పూనమ్ బజ్వా యోగ చేస్తున్న దృశ్యాలు, వీడియోలు, వెకేషన్ పిక్స్ షేర్ చేయడం చూస్తూనే ఉన్నాం. కాస్త గ్లామర్ డోసు పెంచి చేసిన ఫోటోషూట్స్ కూడా ఉన్నాయి. తాజాగా పూనమ్ బజ్వా ఫ్యాన్స్ కి సండే ట్రీట్ ఇచ్చింది. రెడ్ టాప్ ధరించిన పూనమ్ బజ్వా ఎప్పటిలాగే గ్లామర్ డోసు పెంచి ఫోజులు ఇచ్చింది. పూనమ్ బజ్వా అదిరిపోయే లుక్ కి యువత ఫిదా అవుతున్నారు.
#PoonamBajwa pic.twitter.com/UGjcaIIr5G
— VD bulletin (@vdbulletin) May 20, 2024
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa