ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తమన్నా బోల్డ్ కామెంట్స్

cinema |  Suryaa Desk  | Published : Mon, May 20, 2024, 03:55 PM

తమన్నా పేరు చెప్పగానే యువత మైకంలో మునిగిపోతారు. అంతలా తమన్నా గ్లామర్ తో మెస్మరైజ్ చేస్తోంది. కెరీర్ బిగినింగ్ నుంచి తమన్నా గ్లామర్ తో మాయ చేస్తూనే ఉంది. వెండి తెరపై అందంగా కనిపించడంలో తమన్నాకి ఎలాంటి హద్దులు లేవు. కానీ శృంగార సన్నివేశాలు, ముద్దు సీన్లలో నటించకూడదని నిబంధన పెట్టుకుంది. కానీ ఆ నిబంధనని కూడా గత ఏడాది తమన్నా బ్రేక్ చేసింది. లస్ట్ స్టోరీస్ 2, జీ కార్ద అనే వెబ్ సిరీస్ లలో తమన్నా బోల్డ్ గా రెచ్చిపోయింది. ఘాటుగా శృంగార సన్నివేశాల్లో నటించడంతో తమన్నాపై ట్రోలింగ్ కూడా జరిగింది. 


నటిగా ఒకే తరహాలో ఎందుకు ఉండాలి ? అన్ని రకాల పాత్రలు చేస్తే తప్పేంటి ? అని తనని తాను ప్రశ్నించుకుని తన రూల్ ని బ్రేక్ చేసినట్లు అప్పట్లో తమన్నా వివరణ ఇచ్చింది. అయితే చివరగా తమన్నా బాక్ అనే చిత్రంలో నటించింది. ఈ మూవీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. తమన్నా, రాశి ఖన్నా కలసి ఈ చిత్రంలో నటించారు. తాజాగా ఇంటర్వ్యూలో తమన్నా మరోసారి బోల్డ్ కామెంట్స్ చేసింది. శృంగార సన్నివేశాలు, ముద్దు సీన్లలో నటించేటప్పుడు హీరోయిన్లు ఇబ్బంది పడుతుంటారు అని అంటారు. కానీ అది వాస్తవం కాదు. ఆ సన్నివేశాల్లో హీరోయిన్ల కంటే ఎక్కువ ఇబ్బంది, టెన్షన్ ఫీల్ అయ్యేది మగవారే. తనతో పాటు నటిస్తున్న నటి ఇబ్బంది పడకుండా మనం జాగ్రత్తగా ఉండాలని మెల్ యాక్టర్స్ భావిస్తారు. వాళ్ళు ఏమనుకుంటారో అని తెగ టెన్షన్ పడిపోతుంటారు అని తమన్నా పేర్కొంది. దీని వల్ల సన్నివేశం ఎఫెక్ట్ అవుతుంది. అలా జరగకుండా ఉండాలంటే నటీనటులు ఇద్దరూ ఒక అండర్ స్టాండింగ్ తో నటించాల్సి ఉంటుంది. అప్పుడే ఇద్దరికీ ఇబ్బంది లేకుండా సన్నివేశం బాగా వస్తుంది అని తమన్నా పేర్కొంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com