మలయాళంలో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘మంజుమ్మల్ బాయ్స్’ మూవీ తెలుగులోనూ రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే, తాజాగా చిత్రయూనిట్‌కి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయారాజా లీగల్ నోటీసులు పంపించారు. ఈ సినిమా క్లైమాక్స్‌లో తాను కంపోజ్ చేసిన ’గుణ‘ చిత్రంలోని కన్మణి అన్బోడు పాటను తమ అనుమతి లేకుండా వాడుకున్నందుకు చిత్రనిర్మాణ సంస్థకు ఇళయారాజా తరపు లాయర్ శరవణన్ నోటీసులు పంపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa