అజయ్ ఘోష్, చాందినీ చౌదరి ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ . ఫ్లై హై సినిమాస్ బ్యానర్ పై హర్ష గారపాటి మరియు రంగారావు గారపాటి ఈ మూవీని నిర్మించారు. శివ పాలడుగు ఈ సినిమాకి కథ, కథనాన్ని అందించి దర్శకత్వం వహించారు. కాన్సెప్ట్, కంటెంట్ బేస్డ్ సినిమాగా రాబోతోన్న ఈ మూవీ టీజర్, పాటలు, పోస్టర్లు ఇప్పటికే మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. ఈ సినిమా జూన్ 14న ప్రేక్షకుల ముందుకు రానుండగా తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌ను చూస్తే ఓ వైపు నవ్విస్తూనే మరో వైపు సున్నితమైన ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కంటతడి పెట్టించేలా ఉంది. మిడిల్ క్లాస్ కష్టాలు, వారి కలలు వాటిని నెరవేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదనేలా ఈ చిత్రంలో చూపించబోతున్నారని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ‘అన్నీ మన కోసమే చేసుకోకూడదు.. కొన్ని మన అనుకునేవాళ్ల కోసం వదులుకోవాలి’ అంటూ అజయ్ ఘోష్ చెప్పిన ఎమోషనల్ డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి శ్రీనివాస్ బెజుగం కెమెరామెన్‌గా పని చేయగా, పవన్ సంగీతం అందించారు. బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటర్‌గా వర్క్ చేశారు. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, బేబీ, డీజె టిల్లు వంటి బ్లాక్ బస్టర్లను విజయవంతంగా పంపిణీ చేసిన ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa