మెరుపు తీగలాంటి బ్యూటీ కృతి సనన్. మహేష్ బాబు 1 నేనొక్కడినే చిత్రంతో కృతి సనన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం నిరాశ పరచడం కృతికి మైనస్ గా మారింది. ఆ తర్వాత నాగ చైతన్యకు జోడిగా నటించిన దోచేయ్ చిత్రం కూడా నిరాశపరచడంతో కృతి సనన్ బాలీవుడ్ బాట పట్టింది. ఇప్పుడు కృతి సనన్ బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఈ నిర్ణయం ఆమెకు మంచి ఫలితాన్ని ఇచ్చింది. బాలీవుడ్ లో వరుస సక్సెస్ లు రావడంతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం కృతి సనన్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరు. గత ఏడాది కృతి సనన్ కి బిగ్ షాక్ తగిలింది. ప్రభాస్ కి జోడిగా నటించిన ఆదిపురుష్ చిత్రం ఏమాత్రం ఆకట్టుకోలేదు మరోవైపు దేశం నలువైపుల నుంచి ఆదిపురుష్ చిత్రాన్ని వివాదాలు చుట్టుముట్టాయి. ఈ చిత్రంలో కృతి సనన్ సీతాదేవి పాత్రలో నటించి మెప్పించింది. ఆమె పాత్రకి సంబంధించి ఎలాంటి సమస్య లేదు. ఇతర పాత్రల్లో దర్శకుడు ఓం రౌత్ వాడిన కాస్ట్యూమ్స్ గ్రాఫిక్స్, డైలాగ్స్ పై వివాదాలు చెలరేగాయి. ఇటీవల కృతి సనన్.. సీనియర్ హీరోయిన్లు టబు, కరీనా కపూర్ తో కలసి క్రూ అనే లేడి మల్టీస్టారర్ చిత్రంలో నటించింది. కరీనా కపూర్,టబు, కృతి సనన్ ముగ్గురూ కలిసి నటించడంతో గ్లామర్ యాడ్ అయింది. ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా కృతి సనన్ క్రేజీ డ్రెస్ లో మెరుపులు మెరిపించింది. ఎప్పటిలాగే గ్లామర్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. గ్లామర్ ఘాటు పెంచి కృతి సనన్ ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి.