ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యకాలంలో అందరూ ఎదురుచూస్తున్న సినిమాల్లో ఈ ప్రాజెక్ట్ ఒకటి. ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందించబడుతుందని వార్తలు వస్తున్నాయి. ఇటీవలే, చిత్రనిర్మాతలు ఎన్టీఆర్ 31 ఆగస్టు 2024లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారని ప్రకటించారు. షూటింగ్ దాదాపు 15 దేశాల్లో జరుగనున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర, వార్ 2 షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్ను నిర్మిస్తుంది.