టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని రాజమౌళితో ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజా అప్డేట్ ప్రకారం, ఈ గ్లోబల్-ట్రాటింగ్ అడ్వెంచర్ ఫిల్మ్ ని రాజమౌళి ఆగస్ట్ 2024 చివరి నాటికి సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కెఎల్ నారాయణ ఈ భారీ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa