దిశా పటాని పూరి జగన్నాధ్ లోఫర్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన నటించిన లోఫర్ మూవీ డిజాస్టర్ గా నిలిచింది.దిశా పటాని పూరి జగన్నాధ్ లోఫర్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన నటించిన లోఫర్ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. దీనితో దిశా పటానికి ఆదిలోనే ఫ్లాప్ ఎదురైంది. అయితే ఆమె బ్యూటిఫుల్ గా ఉందంటూ ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ మూవీనే ఇలా నిరాశ పరచడంతో దిశా పటానికి టాలీవుడ్ లో ఆఫర్స్ రాలేదు. దీనితో దిశా పటాని బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. దిశా పటాని బాలీవుడ్ లో తిరుగులేని గ్లామర్ హీరోయిన్ గా అవతరించింది. ఏదో ఒక విధంగా దిశా నిత్యం వార్తల్లో ఉంటుంది. తరచుగా ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. దిశా పటాని ఇన్స్టాగ్రామ్ లో తన కొత్త పిక్ పోస్ట్ చేసిందంటే క్షణాల్లో వైరల్ కావలసిందే. అంతలా ఆమె క్రేజ్ వ్యాపించింది. నటిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన దిశా పటాని ఒక్క చిత్రంతోనే ఆమె ప్రయాణం ఆగిపోయింది. దిశా పటాని ఏదో విధంగా క్రేజీ చిత్రాల్లో ఆఫర్స్ అందుకుంటోంది. దిశా పటాని కొన్నేళ్ల పాటు బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ తో ప్రేమాయణం సాగించిన సంగతి తెలిసిందే. టైగర్ ఫ్యామిలీకి కూడా దిశా బాగా దగ్గరైంది. కానీ ఏమైందో తెలియదు కానీ దిశా.. టైగర్ ష్రాఫ్ తో బ్రేకప్ చేసుకుంది. కానీ సడెన్ గా వీరిద్దరూ విడిపోయినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా దిశా పటాని కొత్త ప్రియుడితో చట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. తాజాగా దిశా పటాని తన సహజసిద్ధమైన శైలిలో గ్లామర్ ఫొటోస్ షేర్ చేసింది. అందంగా ఉన్న గ్రీన్ డ్రెస్ లో దిశా మెరిసింది. ప్రస్తుతం దిశా పటాని ప్రభాస్ కల్కి 2898 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
#DishaPatani pic.twitter.com/7AJe0eZRPY
— VD bulletin (@vdbulletin) June 3, 2024
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa