ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'తీస్ మార్ ఖాన్'

cinema |  Suryaa Desk  | Published : Wed, Jun 05, 2024, 02:48 PM

కళ్యాణ్ జీ గోగన దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆది సాయికుమార్ నటించిన 'తీస్ మార్ ఖాన్' సినిమా ఆగస్ట్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ఆది సాయికుమార్ సరసన గ్లామరస్ దివా పాయల్ రాజ్‌పుత్ జంటగా కనిపించనుంది. తాజాగా ఇప్పుడు ఈ మాస్ యాక్షన్ థ్రిల్లర్‌ జూన్ 5, 2024 సాయంత్రం 05.00 గంటలకు స్టార్ మా గోల్డ్ ఛానెల్‌లో వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ గా ప్రదర్శించబడుతుంది. ఈ సినిమాలో సునీల్, పూర్ణ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకి సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. విజన్ సినిమాస్ పతాకంపై ప్రముఖ వ్యాపారవేత్త డా.నాగం తిరుపతి రెడ్డి ఈ సినిమాని నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa