హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన భర్త గురించి ఆసక్తికర విషయాలు తెలిపింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘‘గౌతమ్ తనను బాగా సపోర్ట్ చేస్తాడు. ఆయన ప్రోత్సాహంతోనే మళ్లీ సినిమాలు చేస్తున్నాను. ఖాలీ సమయం దొరికితే తెలుగుతో పాటు అన్ని భాషల సినిమాలు చూస్తాడు. టాలీవుడ్ హీరోయిన్లలో సమంత, రష్మిక, రాశీఖన్నా అంటే గౌతమ్కి చాలా ఇష్టం’’ అని కాజల్ చెప్పుకొచ్చింది.