ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'హరోమ్ హర' టీమ్ స్పెషల్ ఇంటర్వ్యూ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Thu, Jun 06, 2024, 03:45 PM

జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో నైట్రో స్టార్ సుధీర్ బాబు ప్రస్తుతం తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి చిత్ర బృందం 'హరోమ్ హర' అనే టైటిల్ ని లాక్ చేసింది. మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రొమోషన్స్ ని ప్రారంభించారు. తాజాగా ఇప్పుడు మూవీ టీమ్ చేసిన స్పెషల్ ఇంటర్వ్యూ ని చిత్ర బృందం యూట్యూబ్ లో విడుదల చేసింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రం జూన్ 14, 2024న విడుదలకి సిద్ధంగా ఉంది. ఈ ప్రాజెక్ట్‌లో మాళవిక శర్మ కథానాయికగా నటించింది. సునీల్, జయ ప్రకాష్, అక్షర, అర్జున్ గౌడ, లక్కీ లక్ష్మణ్, రవి కాలే మరియు ఇతరులు ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. చైతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీత అందిస్తున్నారు. శ్రీ సుబ్రమణ్యేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై సుమంత్ నాయుడు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa