రామోజీరావు మృతి పట్ల తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సంతాపం వ్యక్తం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. సంతాప సూచికగా రేపు సినిమా షూటింగ్ లకు సెలవు ప్రకటించినట్లు ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ తెలిపారు. కాగా రేపు ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు జరగనున్నాయి. రామోజీ ఫిల్మ్ సిటీలో ఆయన పార్థివదేహానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa