ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'వార్ 2' లో అలియా భట్

cinema |  Suryaa Desk  | Published : Sat, Jun 08, 2024, 04:57 PM

బాలీవుడ్ మూవీ వార్ 2లో సౌత్ ఇండియన్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్రలో కనిపించనున్న సంగతి అందరికి తెలిసిందే. హృతిక్ రోషన్ మరియు టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలలో  నటించిన వార్ 2 పై  భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో ఎన్టీఆర్ స్పెషల్ లుక్‌లో కనిపించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో అలియా భట్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే.. జూలై చివరి వారంలో అలియా భట్ ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించనుంది అని లేటెస్ట్ టాక్. బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ ఈ యాక్షన్ థ్రిల్లర్‌కి దర్శకత్వం వహించనున్నారు. ఈ భారీ మల్టీస్టారర్ 2025 ఆగస్టు 14న విడుదల కానుంది. ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై, వార్, పఠాన్, మరియు టైగర్ 3 తర్వాత YRF స్పై యూనివర్స్‌లో ఇది ఆరవ చిత్రం. వార్ 2 చిత్రాన్ని యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa