తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తున్న గేమ్ షోస్ లో బిగ్ బాస్ షో ఒకటి. బిగెస్ట్ రియాలిటీ షోగా మంచి క్రేజ్ తెచ్చుకున్న బిగ్ బాస్.. చాలా భాషల్లో టెలికాస్ట్ అవుతుంది.తెలుగులో ఇప్పటికే ఏడూ సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు ఎనిమిదో సీజన్ కు రెడీ అవుతుంది. బిగ్ బాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మొదటి సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు. మొదటి సీజన్ భారీ హిట్ అయ్యింది. తారక్ హోస్ట్ చేసిన విధానం ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. ఆ తర్వాత సీజన్ కు నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించాడు. మొదటి సీజన్ తో పోల్చుకుంటే ఈ సీజన్ అంతగా రేటింగ్ సొంతం చేసుకోలేదు. ఆతర్వాత బిగ్ బాస్ బాధ్యతను కింగ్ నాగార్జున భుజాల పై వేసుకున్నారు. బిగ్ బాస్ సీజన్ 3 నుంచి రీసెంట్ గా వచ్చిన బిగ్ బాస్ సీజన్ 7 వరకు నాగార్జున హోస్ట్ గా చేసుకుంటూ వచ్చారు. అలాగే బిగ్ బాస్ ఓటీటీకి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు.ఇక బిగ్ బాస్ సీజన్ 7 ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రైతు బిడ్డగా హౌస్లోకి వెళ్లిన పల్లవి ప్రశాంత్ ఈ సీజన్ లో విన్నర్ గా నిలిచాడు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 కోసం రెడీ అవుతుందని తెలుస్తోంది. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 8 కోసం రంగం సిద్ధమైందని తెలుస్తోంది. సెప్టెంబర్ లో బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. కాగా ఈ సీజన్ లో బిగ్ బాస్ హౌస్ లో పాల్గొంది వీరే అంటూ కొంతమంది పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అంతే కాదు దాదాపు వీరు కన్ఫర్మ్ అని గుసగుసలాడుకుంటున్నారు ప్రేక్షకులు. ఇంతకూ ఆ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారంటే..యూట్యూబర్ బంచిక్ బబ్లూ, హీరో రాజ్ తరుణ్, యూట్యూబర్ సోనియా సింగ్, నటి హేమ, నేత్ర, వంశీ, రీతూ చౌదరి, సురేఖ వాణి ( లేదా ఆమె కూతురు సుప్రీత), కిరాక్ ఆర్పీ, కుమారి ఆంటీ, బర్రెలక్క, కుషిత కొల్లపు, బుల్లెట్ భాస్కర్, చమ్మక్ చంద్ర, అమృత ప్రణయ్ వీరితో పాటు మరికొంతమంది కూడా బిగ్ బాస్ సీజన్ 8 లో పాల్గొంటారని తెలుస్తోంది. మరి ఫైనల్ గా వీరిలో ఎంతమంది బిగ్ బాస్ సీజన్ 8 లో పాల్గొంటారో.. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురుచూసాల్సిందే.