ట్రెండింగ్
Epaper    English    தமிழ்

200 బౌన్సర్ల మధ్య నయనతార సాంగ్ అదిరింది

cinema |  Suryaa Desk  | Published : Mon, Oct 30, 2017, 11:38 AM

దక్షిణాది అగ్ర హీరోయిన్ నయనతార తాజాగా మోహన్ రాజా దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తోంది. ఇందులో యంగ్ హీరో శివకార్తీకేయన్ హీరోగా నటిస్తున్నాడు. 'వేలైక్కారన్' పేరుతో రూపొందుతోన్న ఈ సినిమాలో ఓ మురికివాడకి చెందిన యువకుడిగా శివకార్తికేయన్ కనిపించనున్నాడు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఓ పాటను రాజస్థాన్- కిషన్ ఘడ్ ప్రాంతంలోని మార్బల్‌లో చిత్రీకరించారు. 


 మంచు కురుస్తున్న వాతావారణాన్ని క్రియేట్ చేసి.. అక్కడ వేసిన ప్రత్యేకమైన సెట్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ముందుగా ఈ పాటను కాశ్మీర్‌లో ప్లాన్ చేసినా.. అక్కడి వాతావరణం అనుకూలించకపోవడంతో.. సెట్లో షూట్ చేయడం జరిగిందని సినీ యూనిట్ వెల్లడించింది. ఇక స్థానికులచే షూటింగ్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా వుండేందుకు 200 మంది బౌన్సర్ల మధ్య ఈ పాటను చిత్రీకరించినట్లు వార్తలు వస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa