నటి రేణూ దేశాయ్ తన రెండో వివాహం గురించి పెదవి విప్పారు. పవన్ కళ్యాణ్‌తో విడాకుల అనంతరం తన ఇద్దరు పిల్లలు అకీరా నందన్, ఆద్యలతో కలిసి రేణూ పుణెలో సెటిల్ అయిపోయారు.రెండేళ్ల క్రితం తన జీవితంలోకి మరో వ్యక్తి రాబోతున్నారని వెల్లడించారు. ఇద్దరూ నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల అది వివాహానికి దారి తీయలేదు.” నేను రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు నా ఇద్దరు పిల్లలు ఇంకా చిన్నవాళ్లు. వారికి నా అవసరం ఉంది. నా పాటికి నేను పెళ్లి చేసుకుని వెళ్లిపోతే భర్తకే సమయం కేటాయించాల్సి ఉంటుంది. అప్పుడు నా పిల్లలు ఒంటరివారు అయిపోతారు. అది నాకు ఇష్టం లేదు. ఇప్పుడు అకీరా, ఆద్యలు పెద్దవాళ్లు అవుతున్నారు. వారికి నా అవసరం చాలా తక్కువగా ఉన్నప్పుడు నేను రెండో పెళ్లి గురించి ఆలోచిస్తాను. ఇంకో రెండు మూడేళ్లలో నాకంటూ ఓ తోడుని వెతుక్కుంటాను “” అని తెలిపారు.