రాజేష్ జగన్నాధం దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో వరుణ్ సందేశ్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'నింద' అనే టైటిల్ ని లాక్ చేసారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమా యొక్క నైజాం రైట్స్ ని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్ LLP సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. అన్నీ, తనికెళ్ల భరణి, భద్రమ్, సూర్య కుమార్, చత్రపతి శేఖర్, మైమ్ మధు, సిద్ధార్థ్ గొల్లపూడి, అరుణ్ దలై ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంతు ఓంకార్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా జూన్ 21, 2024న విడుదల కానుంది.