పెళ్లి పై టాలీవుడ్ హీరోయిన్ సదా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పెళ్లి చేసుకొని ప్రస్తుతం అనుభవిస్తున్న స్వేచ్ఛను వదులుకోలేనని సదా అన్నారు. ఈ విషయమై మాట్లాడుతూ..'ఇంతవరకూ నా హృదయానికి ఎవరూ దగ్గర కాలేదు. ఎవరైనా నచ్చితే అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తా. నేను అరేంజ్డ్ మ్యారేజ్ కు వ్యతిరేకం. లవ్ మ్యారేజ్ మాత్రమే చేసుకుంటా. భాగస్వామిని భరించడం కష్టం అనిపిస్తే విడాకులు తీసుకోవడంలో తప్పు లేదు' అంటూ చెప్పుకొచ్చారు.