ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నయనతారతో విభేదాలు నిజమే : త్రిష

cinema |  Suryaa Desk  | Published : Thu, Jun 27, 2024, 02:22 PM

హీరోయిన్లు త్రిష,నయనతార మధ్య విభేదాలు వచ్చాయా..? ఇద్దరికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉందా..? అసలుఇద్దరికి గొడవ ఎక్కడ వచ్చింది. ఈ విషయంలో నిజం ఒప్పుకున్న త్రిష ఏమని క్లారిటీ ఇచ్చింది..? ఫిల్మ్ ఇండస్ట్రీలో.. మరీ ముక్యంగా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నాలుగు పదులు దాటినా.. ఇంకా గ్లామర్ హీరోయిన్లుగా కొనసాగుతున్న వారిలో త్రిష‌, నయనతార ముందు ఉన్నారు. త్రిష 40 ఏళ్లు  వయస్సు దాటగా.. నయనతార 40కి అడుగు దూరంలో ఉంది.  అయితే ఈ ఇద్దరు తారలు సౌత్ లో స్టార్ హీరోయిన్లు గా వెలుగు వెలిగారు. ఆల్ మోస్ట్ స్టార్ హీరోల సరసన మెరిసారు. ఇప్పటికీ హీరోయిన్లు గా కొనసాగుతూ.. తమ సత్తా చాటుతున్నారు. రెమ్యూనరేషన్ కూడా గట్టిగానే వసూలు చేస్తున్నారు. అయితే ఈ ఇద్దరు హీరోయిన్ల మధ్య గొడవలు ఉన్నట్టు ఎప్పటినుంచో ఇండస్ట్రీలో న్యూస్ హల్ చల్ చేసింది. ఇద్దరి మధ్య వైరం గట్టిగా ఉన్నట్టు టాక్. ఉత్తుత్తి మాట కాదు... నిజంగానే వీరిమధ్య గొడవలు ఉన్నాయట. ఈ విషయాన్ని స్వయంగా త్రిష ఓ సందర్బంలో ఒప్పుకున్నారు. ఆమె చెప్పిన విషయాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇంతకీ త్రిష ఏమన్నదంటే..? 1999లో చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చింది త్రిష. దాదాపు  25 ఏళ్లుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతోంది. 


 


 తమిళంలో విజయ్, అజిత్, సూర్య, శింబు, కమల్, విక్రమ్ వంటి స్టార్ హీరోలతో.. తెలుగులో చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్, మహేష్ బాబు, పవన్ , ప్రభాస్ లాంటి  ప్రముఖ హీరోలతో జోడీ కట్టింది త్రిష.హీరోయిన్ గా కెరీర్ అయిపోయిన తరువాత చాలా కాలం  సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటీ.. పొన్నియన్ సెల్వన్ సినిమాతో మరోసారి హీరోయిన్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి.. అందరికి షాక్ఇచ్చింది. ఇక ఆతరువాత విజయ్ తో లియో హిట్ అవ్వడంతో ఇప్పుడు అజిత్, కమల్, చిరంజీవి సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. 40 ఏళ్ళు దాటినా బ్యూటీ కాని ఫిట్ నెస్ కాని ఏమాత్రం తగ్గకుండా చూసుకుంటుంది. ఇక ఈ ఇద్దరు తారలు స్టార్లు గా  సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఊపు ఊపేశారు. అంతే కాదు ఇప్పటికీ  అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులు గా ఉన్నారు. ఇక వీరి మధ్య విభేదాలకు సబంధించిన త్రిష ఓ సందర్భంలో స్పందిస్తూ... క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో త్రిష ఇచ్చిన ఓ పాత ఇంటర్వ్యూ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా త్రిష మాట్లాడుతూ తనకు, నయనతారకు సమస్య ఉన్న మాట వాస్తవమే అని అన్నారు. అయితే ఈ విభేదాలు  వృత్తిపరమైన కారణాల వల్ల వచ్చినవి కాదని.. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల జరిగిందని, సమయం గడిచేకొద్దీ మేము ఒకరినొకరు అర్థం చేసుకున్నామని త్రిష చెప్పింది. ఇప్పుడు మనం స్నేహితులం అని కూడా త్రిష అన్నారు. అయితే వీరిమధ్య విబేధాలకు కారణం ఓ సినిమా అని తెలుస్తోంది.  గతంలో నయనతార కురువి సినిమాలో మొదటగా నటించిగా..  ఆ అవకాశం నయనతార నుంచి త్రిషకు వెళ్లింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com