మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్ఘ తేజ్ తన తదుపరి చిత్రాన్ని రోహిత్ కెపినితో ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. 'SDT 18' పేరుతో ప్రకటించబడిన ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళంలో పాన్-ఇండియా ప్రాజెక్ట్‌గా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబరాల ఏటి గట్టు అనే పేరు పెట్టాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు లేటెస్ట్ టాక్. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కోసం భారీ సెట్ వేస్తున్నారు. ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా కనిపించనుంది. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని, సాయిధరమ్ తేజ్ కొత్త లుక్‌లో కనిపించనున్నాడని సమాచారం. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.