టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన 14వ చిత్రాని పలాస ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో చేస్తున్నట్లు అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ పాన్-ఇండియన్ చిత్రానికి 'మట్కా' అని టైటిల్ ని లాక్ చేసారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో వేసిన సెట్‌లో ఈ సినిమా షెడ్యూల్ జరుగుతోంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో పాతకాలపు లుక్‌లో కనిపించనున్నాడు. వరుణ్ తేజ రెమ్యూనరేషన్ గురించి సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. మూవీ మేకర్స్ 'మట్కా' కోసం దాదాపు 50 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. మొదట 12 కోట్లు రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిన వరుణ్ తేజ్ సినిమా బడ్జెట్‌ను పరిగణనలోకి తీసుకొని 6 కోట్లలకి ఒప్పుకున్నట్లు సమాచారం. ఈ హై-బడ్జెట్ మూవీలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి ముఖ్య పాత్రలో కనిపించనుంది. నవీన్ చంద్ర, కన్నడ కిషోర్, అజయ్ ఘోష్, మైమ్ గోపి, రూపలక్ష్మి, విజయరామరాజు, జగదీష్, రాజ్ తిరందాస్ మరియు ఇతరులు ఈ సినిమా కీలక పత్రాలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి (సివిఎం), డా.విజేందర్ రెడ్డి తీగల ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించనున్నారు.