'కల్కి 2898ఏడీ' సినిమాలో నటించాలని మూవీ టీం తన వద్దకు రాగానే ఏమాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పానని మృణాల్ ఠాకూర్ తెలిపారు. 'నిర్మాతలు అశ్వినీ దత్, స్వప్న, ప్రియాంకతో నేను సీతారామం చేశాను. వారి అభిరుచిపై నాకు చాలా నమ్మకముంది. అందుకే ఇలాంటి భారీ ప్రాజెక్ట్‌లో అవకాశం అనగానే ఏమాత్రం ఆలోచించకుండా ఓకే చేసేశా' అని పేర్కొన్నారు. నిన్న విడుదలైన 'కల్కి 2898ఏడీ' బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.