పవన్‌కల్యాణ్ డిప్యూటీ సీఎం అయిన క్షణంలో తాను భావోద్వేగానికి గురైనట్లు ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తెలిపారు. ‘‘నేను పవన్‌కల్యాణ్‌కు వీరాభిమానిని. ఆయన సినిమాలు రాసే అదృష్టం మాకు రాలేదు. రాజకీయాల్లో ఆయన పోరాటం చేశారు. ఎన్నో సవాళ్లు ఎదుర్కొని.. వేల ఓట్ల మెజారిటీతో గెలవడం సామాన్యమైన విషయం కాదు. తన పార్టీ తరఫున పోటీలో నిలిచిన వారందరినీ గెలిపించుకొని చరిత్ర సృష్టించారు’’ అని పేర్కొన్నారు.