కోలీవుడ్ స్టార్ నటి నయనతార ఇటీవల RJ బాలాజీ దర్శకత్వం వహించిన మూకుతి అమ్మన్కి సీక్వెల్ లో నటిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. తాజాగా ఇప్పుడు, గతంలో నయనతారను ఐరా చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడు కెఎమ్ సర్జున్తో ప్రిన్స్ పిక్చర్స్ కొత్త చిత్రాన్ని ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్‌లో నయనతార ప్రధాన పాత్ర పోషిస్తుందనే వార్త చక్కర్లు కొడుతోంది. అయితే ఇది ఇంకా అధికారికంగా ధృవీకరించబడలేదు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రానికి ప్రఖ్యాత సినీ విమర్శకుడు బరద్వాజ్ రంగన్ రచయితగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.