డెనిస్ విల్లెనెయువ్ దర్శకత్వం వహించి నిర్మించిన హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ డూన్: పార్ట్ టూ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ ని సృష్టించింది. $190 మిలియన్ల బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం దాదాపు $700 మిలియన్లను వసూలు చేసింది. ఈ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ యొక్క తెలుగు వెర్షన్ డిజిటల్ రైట్స్ ని జియో సినిమా సొంతం చేసుకుంది. ఈ సినిమా ఆగష్టు 1, 2024న ప్రసారానికి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. డూన్ 2 సినిమా డూన్ (2021)కి సీక్వెల్ మరియు ఇది అదే పేరుతో ఫ్రాంక్ హెర్బర్ట్ యొక్క నవల ఆధారంగా రూపొందించబడింది. ఈ చిత్రంలో తిమోతీ చలమెట్, జెండయా, రెబెక్కా ఫెర్గూసన్, జోష్ బ్రోలిన్ మరియు ఇతరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.