కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ తన 62వ ప్రాజెక్ట్ ని యువ తమిళ దర్శకుడు మగిజ్ తిరుమేనితో చేస్తున్నట్లు అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి విదా ముయార్చి అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాలో అజిత్ కి జోడిగా తమిళ స్టార్ నటి త్రిష జోడిగా కనిపిస్తుంది. తాజాగా చిత్ర బృందం ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ యొక్క అజర్బైజాన్ షెడ్యూల్ ని పూర్తి చేసినట్లు సామాచారం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో ఫోటోని షేర్ చేసారు. ఈ సినిమాలో రెజినా కాసాండ్రా, ఆరవ్, అర్జున్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ బిగ్గీలో హిందీ నటుడు సంజయ్ దత్ ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. కోలీవుడ్ హిట్ మెషిన్ అనిరుధ్ రవిచందర్ ఈ హై బడ్జెట్ ఎంటర్టైనర్కు సంగీతం అందిస్తున్నారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్‌ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.