ఆదిత్య ధర్ దర్శకత్వం వహించనున్న కొత్త చిత్రానికి రణవీర్ సింగ్ సంతకం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ ఈ రోజు ప్రకటించబడింది మరియు ఈ చిత్రంలో కొంతమంది పెద్ద స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని రణ్వీర్ సింగ్ స్వయంగా ప్రకటించాడు. సీక్రెట్ ఏజెంట్ల మధ్య సాగే ఈ సినిమా షూటింగ్ ఆగస్టులో ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాల్ని మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.