సామ్ ఆంటోన్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'బడ్డీ' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రం ఆగష్టు 2న విడుదల కానుంది. తాజాగా ఇప్పుడు మూవీ టీమ్ ఈ సినిమా తెలుగురాష్ట్రాలలో సింగల్ స్క్రీన్ కి 99 రూపాయలు మరియు మల్టీప్లెక్స్ కి 125 రూపాయల ధరని లాక్ చేసినట్లు సమాచారం. అజ్మల్ అమీర్, ప్రిషా రాజేష్ సింగ్, ముఖేష్ కుమార్, మహమ్మద్ అలీ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. హిప్ హాప్ తమిజా ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. స్టూడియో గ్రీన్ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై కె.ఇ జ్ఞానవేల్రాజా, ఆధాన జ్ఞానవేల్రాజా బడ్డీని నిర్మిస్తున్నారు.