తాను రెండో పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాన్ని నటి రేణూ దేశాయ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘‘పేరెంట్స్ ఉండి కూడా వారి ప్రేమను నేను దక్కించుకోలేకపోయాను. విడాకులు ప్రకటించిన అనంతరం నా పేరెంట్స్ నన్ను దగ్గరికి కూడా తీసుకోలేదు. అది నన్ను చాలా బాధపెట్టింది. నాలాగే నా పిల్లల జీవితం కాకూడదని.. రెండో వివాహం చేసుకోలేదు’’ అని వెల్లడించారు.