2018లో విడుదలైన అంధాధున్ భారతీయ చలనచిత్రంలో అత్యుత్తమ బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్లలో ఒకటిగా నిలిచింది. జాతీయ అవార్డు గెలుచుకున్న ఈ చిత్రంలో టబు, ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే కీలక పాత్రల్లో నటించారు. ఆ తర్వాత తెలుగులో మాస్ట్రోగా, మలయాళంలో భ్రమమ్గా ఇప్పుడు తమిళంలో అంధగన్గా రీమేక్ చేశారు. 'జీన్స్' సినిమా ఫేమ్ ప్రశాంత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ తమిళ చిత్రం రేపు థియేటర్లలో విడుదల కానుంది. త్యాగరాజన్ దర్శకత్వం వహించిన అంధగన్లో సిమ్రాన్, ప్రియా ఆనంద్, కార్తీక్, సముద్రఖని తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. స్టార్ మూవీస్ నిర్మించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సౌండ్‌ట్రాక్ అందించారు.