ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'వేట్టయాన్' కి డబ్బింగ్ చెప్పడం ప్రారంభించిన రాయన్ నటి

cinema |  Suryaa Desk  | Published : Sat, Aug 10, 2024, 04:52 PM

కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ తన తదుపరి చిత్రాన్ని జై భీమ్ ఫేమ్ TJ జ్ఞానవేల్ దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'వేట్టయాన్' అనే టైటిల్ ని ఖరారు చేసారు. ఈ యాక్షన్ డ్రామాలో లెజెండరీ నటుడు పోలీసు పాత్రలో నటిస్తున్నాడు. త్వరలో విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఫహద్ ఫాసిల్, రితికా సింగ్ మరియు అభిరామి తమ డబ్బింగ్ పూర్తి చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న దుషార విజయన్ డబ్బింగ్ చెప్పడం ప్రారంభించినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ డబ్బింగ్ స్టూడియో నుండి కొన్ని పిక్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫహద్ ఫాసిల్, మంజు వారియర్, దుషార విజయన్, రితికా సింగ్, జిఎం సుందర్, రోహిణి, రావు రమేష్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌కు చెందిన సుభాస్కరన్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుధ్ర విచందర్ ఈ సినిమాని సంగీతం సమకూరుస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com