జాన్ అబ్రహం యొక్క రాబోయే చిత్రం 'వేదా' ఆగస్ట్ 15, 2024న విడుదలకి సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో ముంజ్యాలో తన నటనకు పేరుగాంచిన శర్వరి ప్రధాన పాత్రలో నటించింది. ఈ చిత్రంలో తమన్నా భాటియా కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటించారు. నిఖిల్ అద్వానీ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్-ప్యాక్డ్ డ్రామా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యినట్లు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. ఈ చిత్రంలో అభిషేక్ బెనర్జీ కూడా నటించారు. ఉమేష్ KR బన్సాల్, మోనిషా అద్వానీ, మధు భోజ్వానీ మరియు జాన్ అబ్రహంతో పాటు జీ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. మనన్ భరద్వాజ్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు.