వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల కోలాహలం మొదలైంది. శ్రావణ మాస ఆదివారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ముందుగా ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కలతో పాటు తలనీలాలు సమర్పించుకుని సేవలో తరించారు. లఘు దర్శనం ద్వారా భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు చెబుతున్నారు.