శివ కోటటాల దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'దేవర' అనే టైటిల్ ని లాక్ చేసారు. గత కొన్ని రోజులుగా ఆయుధ పూజ పాటను చిత్రీకరిస్తున్న తారక్ నిన్న షూట్ ముగిసిన తర్వాత X లో దేవర పార్ట్ 1 కోసం నా చివరి షాట్‌ను ముగించాను. ఇది ఎంత అద్భుతమైన ప్రయాణం. నేను ప్రేమ సముద్రాన్ని మరియు అద్భుతమైన బృందాన్ని కోల్పోతాను. సెప్టెంబరు 27న శివ రూపొందించిన ప్రపంచంలోకి అందరూ ప్రయాణించే వరకు వేచి ఉండలేం అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. దేవర సెట్లో అతను మరియు కొరటాల శివ ఉన్న చిత్రాన్ని కూడా నటుడు పోస్ట్ చేసారు. ఈ చిత్రం సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా, సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో తారక్ పొన్నప, శృతి మురాతి, వంశి, శ్రీను, హిమజ కీలక పాత్రలో నటిస్తున్నారు. యువసుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.