బాలీవుడ్లో విమర్శకుల ప్రశంసలు పొందిన రొమాంటిక్ డ్రామా 'లైలా మజ్ను' ఇటీవలే రీ రిలీజ్ అయ్యింది. ఈ చిత్రానికి యానిమల్ ఫేమ్ ట్రిప్తి డిమ్రీ మరియు అవినాష్ తివారీ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. లైలా మజ్ను మొదట్లో 2018లో తెరపైకి వచ్చింది. ఈ సినిమా దాదాపు 2.18 కోట్ల గ్రాస్ ని వాసులు చేసింది. రీ-రిలీజ్ కలెక్షన్లు నాలుగు రోజులలో ప్రారంభ రన్ కలెక్షన్లను అధిగమించాయి. ఈ సినిమా ఐదు రోజుల కలెక్షన్లు ఇప్పటికే 3 కోట్ల నెట్ మార్క్ దాటాయి. సాజిద్ అలీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.