బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ చివరిగా లాల్ సింగ్ చద్దా చిత్రంలో కనిపించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ ఫ్లాప్ అయింది. దీని తరవాత నటుడు తన తదుపరి సినిమాని ప్రకటించలేదు. ముంబైలో స్క్రిప్ట్‌లను చదవడంలో మరియు తన కొడుకు చిత్రాలపై దృష్టి పెట్టడంలో బిజీగా ఉన్నాడు. అమీర్ ఖాన్ త్వరలో ఒక సామాజిక నాటకం కోసం ఒకప్పటి దర్శకుడు రాజ్ కుమార్ తో జతకడుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ సినిమా లాక్ అయిందని, త్వరలోనే అనౌన్స్ చేననున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలని మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.