బాలీవుడ్ నటి రియా చక్రవర్తి మరోసారి మీడియా దృష్టిని ఆకర్షించారు. జిరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్‌తో ముంబయి వీధుల్లో చక్కర్లు కొడుతూ కనిపించారు.గత కొంతకాలంగా వీరి మధ్య సాన్నిహిత్యం ఉందన్న రూమర్లు వినిపిస్తూ వచ్చాయి. ఇద్దరూ బైక్‌పై వెళుతూ కనిపించడంతో ఈ వదంతులకు బలం చేకూరింది.సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ ఆత్మహత్య సమయంలో రియా చక్రవర్తి పేరు మీడియాలో ప్రముఖంగా వినిపించింది. అప్పట్లో అనేక న్యాయపరమైన చిక్కులూ ఎదుర్కొంది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆమెను అరెస్ట్ చేసింది. తర్వాత బెయిల్‌పై బయటికొచ్చి కెరీర్‌పై దృష్టి సారించారు. ఈ ఏడాది మే నెలలో 'చాప్టర్2' పేరిట ఓ దుస్తుల బ్రాండ్‌ను స్థాపించారు.
జిరోదా సహ వ్యవస్థాపకుడైన నిఖిల్ కామత్‌కు ఇది వరకే పెళ్లయ్యింది. 2021లో వివాహ బంధానికి వీడ్కోలు పలికారు. ప్రపంచ సుందరి మానుషి చిల్లర్‌తో కొంతకాలం ప్రేమాయణం నడిపారు. ఆ బంధానికీ మూడేళ్ల క్రితమే బ్రేక్ పడింది. ఈ క్రమంలోనే రియాతో పలు సందర్భాల్లో నిఖిల్ పలు పార్టీల్లో మెరిశారు. ఒకే తరహా డ్రెస్సులు ధరించి రూమర్లకు అవకాశం ఇచ్చారు. తాజాగా ఒకే బైక్‌పై ముంబయి వీధుల్లో బైక్‌పై చక్కర్లు కొడుతూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. నిఖిల్ కామత్ హెల్మెట్, మాస్క్ ధరించగా.. రియా మాత్రం కేవలం మాస్క్‌తో కనిపించారు. అయితే, వెనుక సీట్లో కూర్చుని హెల్మెట్ ధరించకపోవడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.