వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని ఒక సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'సరిపోద శనివారం' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా ట్రైలర్ ఈ మూవీ పై భారీ అంచనాలని నెలకొల్పింది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రొమోషన్స్ ని ప్రారంభించారు. అందులో భాగంగా ఇటీవలే చిత్ర బృందం ప్రమోషన్స్ కి చెన్నై కి వెళ్ళింది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ సరిపోదా శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఆగష్టు 24న ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ విషయం గురించి చిత్ర బృందం అధికారికంగా ప్రకటించనుంది. ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటించిన ఈ చిత్రం ఆగస్ట్ 29, 2024న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో సాయికుమార్, అభిరామి, మురళి శర్మ, అజయ్, హర్షవర్ధన్, సుధాకర్, సుప్రీత్ రెడ్డి,అదితి బాలన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ యాక్షన్ డ్రామాకు జేక్ బెజోయ్ సంగీత దర్శకుడు.