బుల్లితెరపై స్టార్ యాంకర్ రాణిస్తోంది రష్మీ గౌతమ్. ప్రస్తుతం ప్రముఖ కామెడీ షో జబర్దస్త్‌కు యాంకర్‌గా ఉన్న రష్మీ అప్పుడప్పుడు స్పెషల్ షోలకు హోస్ట్‌గానూ వ్యవహరిస్తూ బిజీ అయిపోయింది.ఇదిలా ఉంటే తాజాగా రష్మీ గౌతమ్ ఓ షాకింగ్ న్యూస్ షేర్ చేసుకుంది. ఈ మేరకు ఆమె ఎమోషనల్ పోస్ట్ షేర్ చేస్తూ తన ఇంట జరిగిన విషాదన ఘటన గురించి చెప్పింది. ఆమె తాతయ్య అనారోగ్యంతో మరణించినట్టు చెబుతూ ఎమోషనల్ అయ్యింది. తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించింది.ఈ సందర్భంగా ఆమె షేర్ చేసిన వీడియో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. "చివరిగా మా తాతయ్య తనని (నానమ్మ) స్వర్గంలో కలుసుకున్నారు. నిజమైన ఫెమినిస్టు అయిన ఆయనకు ఆగస్టు 17న తుది విడ్కోలు పలికాము. ఆమె కొల్పోయినప్పటి నుంచి ఆయన చాలా ఒంటరితనాన్ని అనుభవించారు. నానమ్మ చనిపోయి ఏడాదిన్నర అవుతుంది. ఈ ఏడాదిన్నర తనని తలుచుకోని రోజు లేదు. ప్రతి రోజు ఆమె గురించి మాట్లాడుతుండేవారు. వారి ఆత్మలు విడదీయరానివి. ఒకరు లేకుండ ఒకరు ఉండేలేరు.