హీరోయిన్ తమన్నా కి సంబంధించిన ప్రైవేట్ ఫొటోసా .. ఇదెక్కడి సీక్రెట్ అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.దానికి కారణం ఓ నటుడు నా ఫోన్లో తమన్నాకి సంబంధించిన 5000 ఫోటోలు ఉన్నాయి అంటూ మాట్లాడాడమే.మరి ఇంతకీ ఆయన ఎవరు..తమన్నా ప్రైవేట్ ఫొటోస్ నిజంగానే ఆయన దగ్గర ఉన్నాయా..అనేది ఇప్పుడు చూద్దాం. మిల్కీ బ్యూటీతమన్నా 30 ఏళ్లు పైబడినా కూడా ఇంకా వరుస అవకాశాలు అందుకుంటూనే ఉంది.ఇక ఎలాంటి ఆఫర్ అయినా సరే ఓకే చేస్తుంది. గ్లామరస్ పాత్ర అయినా, ఐటెం సాంగ్ అయినా సరే ఇండస్ట్రీలో ఉంటే చాలు అనుకుంటుందో లేక రెమ్యూనరేషన్ ఇస్తే పర్లేదు అనుకుంటుందో తెలియదు కానీ తమన్నా మాత్రం ఈ మధ్యకాలంలో వెబ్ సిరీస్ లు, ఐటెం సాంగ్స్,గెస్ట్ రోల్స్ ఇలా ఏదైనా సరే ఓకే చెబుతోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో కూడా వరుస సినిమాల్లో రాణిస్తుంది.. అయితే అలాంటి తమన్నా గురించి తాజాగా ఓ నటుడు సంచలన కామెంట్స్ చేశారు. తమన్నాకి సంబంధించిన 5వేల ప్రైవేట్ ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి అని ఆయన మాట్లాడంతో ప్రస్తుతం ఈ మ్యాటర్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఆయన ఎవరో కాదు తమన్నా ప్రియుడు విజయ్ వర్మ..
ఇక తమన్నావిజయ్ వర్మ లు ప్రేమించుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. వీరిద్దరి మధ్య రిలేషన్ మనకు తెలిసినంతవరకు గత రెండు సంవత్సరాలుగా కొనసాగుతోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో నటుడు విజయ్ వర్మతమన్నా గురించి మాట్లాడుతూ.. మా రిలేషన్ ని రహస్యంగా ఉంచాలి అనుకోలేదు. మా ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉంది కాబట్టి ఈ విషయాన్ని మేము అందరి ముందు బహిరంగంగానే బయట పెట్టాము. చాలామంది కొన్ని విషయాలను రహస్యంగా ఉంచుతూ ఉంటారు. కానీ నాకు అలాంటిది అస్సలు నచ్చదు.ఎందుకంటే బయటికి ఎక్కడికైనా వెళ్లాలన్నా లేదా నచ్చిన ప్రదేశంలో ఫోటో దిగాలన్నా కూడా వీలు ఉండదు. అందుకే నేను నా రిలేషన్ ని బయట పెట్టేసాను. ఇక తమన్నాకు నాకు సంబంధించిన అన్ని విషయాలు మేము పబ్లిక్ గానే అనౌన్స్ చేశాము.
కానీ ఇప్పటికి కూడా మా ఇద్దరికీ సంబంధించిన దాదాపు 5000 ఫోటోలు నా ఫోన్లో ఉన్నాయి. ఈ ఫోటోలు ఇప్పటి వరకు ఎక్కడా కూడా సోషల్ మీడియాలో లేవు. ఆ ఫోటోలు మా ఇద్దరికి మాత్రమే పర్సనల్.. ఈ జనరేషన్లో చాలామంది తమ జీవితాలకంటే పక్కవారి జీవితాల్లోనే ఎక్కువ తొంగి చూస్తూ ఉంటారు. ఎదుటివారి జీవితాలు ఎలా ఉన్నాయి అని తెలుసుకునే పనిలోనే ఉంటారు.అందుకే వాటిని మనం మార్చలేం అంటూ ఆసక్తికర కామెంట్లు చేశారు విజయ్ వర్మ. ప్రస్తుతం విజయ్ వర్మ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారడంతో విజయ్ వర్మ ఫోన్లో 5000 ఫోటోలు అంటే తమన్నా కి సంబంధించిన ప్రైవేట్ ఫొటోస్ ఉన్నాయి కావచ్చు అంటూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు