ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమలాపాల్ మూవీకి A సర్టిఫికేట్

cinema |  Suryaa Desk  | Published : Tue, Jun 04, 2019, 02:59 PM

కోలీవుడ్లో ఇప్పుడు అంతా అమలాపాల్ తాజా చిత్రమైన 'ఆడై' సినిమాను గురించే మాట్లాడుకుంటున్నారు. అమలా పాల్ ప్రధాన పాత్రధారిగా నటించిన ఈ సినిమాకి రత్నకుమార్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని 'A' సర్టిఫికేట్ ను సంపాదించుకుంది.


ఈ సినిమాకి 'U' సర్టిఫికేట్ గానీ .. U/A సర్టిఫికేట్ గాని వస్తుందని భావించిన నిర్మాతలు 'A' సర్టిఫికేట్ రావడంతో ఆలోచనలో పడ్డారట. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను దూరం పెడతారేమోననే టెన్షన్ కి నిర్మాతలు లోనవుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్లనే 'A' సర్టిఫికెట్ ఇచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేసుకుని, ప్రేక్షకుల ముందుకు రానుంది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa