దర్శకుడిగానూ, నిర్మాతగానూ బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన దర్శకుడు మారుతి, సమకాలీన కాన్సెప్ట్‌లతో కొన్ని విలక్షణమైన సినిమాలు చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్‌తో పాన్ ఇండియా చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న దర్శకుడు తన కొత్త నిర్మాణ వెంచర్‌ను ప్రకటించాడు. ఈ చిత్రంలో రాజ్ తరుణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి 'భలే ఉన్నాడే' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. నూతన దర్శకుడు జె శివసాయి వర్ధన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలోని నెవెర్ ఎండ్ స్టోరీ సాంగ్ ని సెప్టెంబర్ 5న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. శేఖర్ చంద్ర కంపోస్ చేసిన ఈ సాంగ్ కి కృష్ణ కాంత్ లిరిక్స్ అందించారు. ఈ సాంగ్ కి మంగ్లీ తన గాత్రాన్ని అందించారు. ఈ విషయాని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమా సెప్టెంబర్ 13, 2024న విడుదల కానుంది. ఈ సినిమాలో మనీషా కంద్కూర్ కథానాయికగా నటిస్తుండగా, ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాస్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. అభిరామి, అమ్ము అభిరామి, లీలా శాంసన్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీత దర్శకుడు. రవికిరణ్ ఆర్ట్స్ ప్రొడక్షన్ నెం.1గా ఎన్.వి.కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, మారుతీ టీమ్ ప్రొడక్ట్ సమర్పిస్తుంది.