ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిత్ర పరిశ్రమపై ప్రభుత్వం మీటింగ్

cinema |  Suryaa Desk  | Published : Mon, Sep 16, 2024, 08:25 PM

మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి జస్టిస్‌ హేమ కమిటీ  ఓ నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే! ప్రస్తుతం ఎక్కడ చూసిన దీనిపైనే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే నటీమణులకు ఎలాంటి సమస్యలు ఉన్నాయనే అంశాలు తెలుసుకోవడంపై పలు చిత్ర పరిశ్రమలు దృష్టి పెట్టాయి. తాజాగా కర్ణాటక ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆ పరిశ్రమకు చెందిన తారతో మీటింగ్‌ నిర్వహించింది. ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు ఎన్‌.ఎం.సురేశ్‌ ఆధ్వర్యలో మీటింగ్‌ జరిగింది. ఆయన మాట్లాడుతూ ‘‘కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్‌ ఆదేశాల మేరకు మేము ఈ మీటింగ్‌ ఏర్పాటు చేశాం. ఇండస్ట్రీలో మహిళలకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది తెలుసుకుని వారి సంరక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలని అనేది ఈ మీటింగ్‌లో చర్చించనున్నాం’’ అని అన్నారు. ఏడు సంవత్సరాలు శ్రమించి జస్టిస్‌ హేమ కమిటీ ఈ రిపోర్ట్‌ రెడీ చేసింది. మలయాళ సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వర్కింగ్‌ కంచిడీషన్లు, రెమ్యూనరేషన్‌, సాంకేతిక రంగంలో మహిళల భాగస్వామ్యం తదితర అంశాలను అధ్యయనం చేసింది. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు పడుతున్న ఇబ్బందుల గురించి అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ హేమ కమిటీ రిపోర్ట్‌ ప్రతి ఇండస్ట్రీలోనూ హాట్‌ టాపిక్‌గా మారింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com