ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై అత్యాచార ఆరోపణలపై సింగర్ చిన్మయి శ్రీపాద ఎక్స్ వేదికగా స్పందించారు. పలు మీడియా కథనాలను ట్యాగ్ చేస్తూ.. ‘రిపోర్టుల ప్రకారం జానీ మాస్టర్ ఆ అమ్మాయి మైనర్‌గా ఉన్నప్పటి నుంచి వేధించడం మొదలు పెట్టాడు. ఈ కేసులో పోరాడేందుకు బాధితురాలికి కావాల్సిన శక్తి చేకూరాలని కోరుతున్నా.’ అని సింగర్ చిన్మయి ట్వీట్ చేశారు.