హీరోయిన్ లావణ్య త్రిపాఠి మెగా హీరో వరుణ్ తేజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇద్దరి కలిసి రెండు సినిమాల్లో నటించారు.మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో వీరిద్దరు జంటగా కనిపించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచియం ప్రేమగా మారింది. లావణ్య త్రిపాఠితో ప్రేమాయణం సాగించిన వరుణ్ తేజ్.. తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకువెళ్లాడు. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించడంతో..మెగా ఇంట్లో పెళ్లి బాజాలు మోగాయి.గతేడాది నవంబర్ 1న ఇటలీలో వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠిల పెళ్లిని మెగా ఫ్యామిలీ ఇటలీలో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. పెళ్లి తరువాత వరుణ్ తన సినిమాలతో బిజీగా మారాడు. వరుణ్ ప్రస్తుతం మట్కా అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇక లావణ్య త్రిపాఠి పెళ్లి తరువాత చాలా సెలక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. ఆమె ఇటీవలే ''మిస్ పర్ఫెక్ట్'' అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిది.
ఆ తర్వాత మరో సినిమాను ఇప్పటి వరకు ప్రకటించలేదు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న లావణ్య తన పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే లావణ్య తాజాగా అభిమానులతో ముచ్చటిస్తుంటారు. ఇదిలా ఉంటే లావణ్య త్రిపాఠి గురించి మెగా డాటర్ నిహారిక చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఇంట్లో లావణ్య వదినే వంట చేస్తోందని నిహారిక చెప్పుకొచ్చింది. 24 గంటలు ఇంట్లోనే ఉంటుందని..అస్సలు బయటకు వెళ్లదని లావణ్య త్రిపాఠి గురించి చెప్పుకొచ్చింది. గంట ఉంటేనే నాకు పిచ్చిలేస్తుందని నిహారిక తెలిపింది. సినిమా షూటింగ్ ఉంటే వెళ్తుందని లేకపోతే .. ఇంట్లో నుంచి బయటకు కూడా రాదని వదిన గురించి చెప్పుకొచ్చింది. ఇక నిహారిక విషయానికి వస్తే.. ఆమె ఇటీవల నిర్మాతగా మారి 'కమిటీ కుర్రాళ్లు' సినిమాను తెరెక్కించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసింది.