కిరణ్‌రావు డైరెక్షన్లో వచ్చిన 'లాపతా లేడీస్' 2025 ఆస్కార్‌కు మన దేశం నుంచి అధికారికంగా ఎంపికైన విషయం విదితమే. దీనిపై ఈ మూవీలో ప్రధాన పాత్రలో నటించిన ప్రతిభారత్న ఆనందం వ్యక్తం చేశారు. ఇందులో ఆమె పుష్పా రాణిగా మెప్పించారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 'ఎంతో ఆనందంగా ఉన్నది. మాటలు రావడం లేదు. మేము ఈ సినిమా ఆస్కార్‌కు మన దేశం నుంచి ఎంపిక కావాలని ఎంతో కోరుకున్నాం. మా ఆశలు నిజమయ్యాయి. కిరణ్‌రావు, అమీర్‌ఖాన్‌లను ఎప్పుడెప్పుడు కలుస్తానా అని ఎదురుచూస్తున్నాను. మా కష్టానికి దక్కిన ఫలితం ఇది. ఒక లక్ష్యాన్ని పెట్టుకుని పనిచేస్తూ పోతుంటే ఫలితాలు వాటంతట అవే వస్తాయి. ప్రస్తుతం నా విషయంలో ఇదే జరుగుతున్నది. నేను ఊహించిన దానికంటే రెట్టింపు ఆనందాన్ని చూడగలుగుతున్నాను' అని ప్రతిభ చెప్పారు.