రామ్ ప్రమీత్, సుమయ నటిస్తున్న చిత్రం ‘ప్రేమజంట’. నిఖిలేష్ తొగరి దర్శకత్వంలో మహేష్ మొగుళ్ళూరి నిర్మిస్తున్నారు. సెన్సార్ పూర్తిచేసుకుంది. స్క్రీన్ మ్యాక్స్ ద్వారా దగ్గుబాటి వరుణ్ ఈ చిత్రాన్ని ఇదే నెల 28న విడుదల చేస్తున్నారు. ”తెలంగాణ నేపథ్యంలో రూపొందిన చిత్రమని” నిర్మాత చెప్పారు. ”నూతన జంట క్యూట్‌గా ఉంటుందని, దర్శకుడు చాలా బాగా తీశాడని, ఐదు పాటలున్నాయని ” తెలిపారు.దర్శకుడు మాట్లాడుతూ ”ఇది క్యూట్ లవ్ స్టోరీ. నిర్మాత సహకారంతో అనుకున్న సమయంలో పూర్తిచేశాం. మిస్ ఆంధ్ర 16 సుమయ హీరోయిన్‌గా నటించింది. దక్షిణ కాశిగా చెప్పబడే ఆదిలాబాద్ ఇంకా ప్రకాశం జిల్లాల్లో షూటింగ్ చేశాం” అని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa