ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాంబే హైకోర్టును ఆశ్రయించిన శిల్పాశెట్టి దంపతులు

cinema |  Suryaa Desk  | Published : Wed, Oct 09, 2024, 04:16 PM

నటి శిల్పాశెట్టి కుంద్రా, ఆమె భర్త రాజ్‌కుంద్రా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి వారి ఇంటిని, ఫామ్‌హౌస్‌ను ఖాళీ చేయాలని ED వారికి నోటీసు పంపింది. ఆ నోటీసును సవాల్ చేస్తూ శిల్పా, కుంద్రా దంపతులు బాంబే హైకోర్టు గడప తొక్కారు. దీనిపై అక్టోబర్ 10న విచారణ జరగనుంది.నటి శిల్పాశెట్టి కుంద్రా, ఆమె భర్త రాజ్‌కుంద్రా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి వారి ఇంటిని, ఫామ్‌హౌస్‌ను ఖాళీ చేయాలని ED వారికి నోటీసు పంపింది. ఆ నోటీసును సవాల్ చేస్తూ శిల్పా, కుంద్రా దంపతులు బాంబే హైకోర్టు గడప తొక్కారు. దీనిపై అక్టోబర్ 10న విచారణ జరగనుంది.ముంబయికి చెందిన ‘వేరియబుల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ అనే సంస్థ 2017లో ‘గెయిన్‌ బిట్‌కాయిన్‌ పోంజీ స్కీమ్‌’ను నిర్వహించింది. ఇందులో భాగంగా బిట్‌కాయిన్లలో పెట్టుబడులు పెడితే నెలకు 10 శాతం లాభాలు వస్తాయని ఆశ చూపి మల్టీ-లెవల్‌ మార్కెటింగ్‌ (MLM) పద్ధతిలో ఏజెంట్ల ద్వారా ముంబయి, దిల్లీ నగరాల్లో అమాయకుల నుంచి రూ.6,600 కోట్లు వసూలు చేశారు. ఈ మోసం బయటపడటంతో సంస్థ, దాని ప్రమోటర్లపై ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.ఈ స్కామ్‌లో మాస్టర్‌మైండ్‌ అయిన అమిత్ భరద్వాజ్‌ నుంచి రాజ్‌ కుంద్రా 285 బిట్‌కాయిన్లను తీసుకున్నట్లు ఈడీ పేర్కొంది. వీటితో ఉక్రెయిన్‌లో బిట్‌కాయిన్‌ మైనింగ్‌ ఫామ్‌ను ఏర్పాటు చేయాలని రాజ్‌కుంద్రా ప్రణాళికలు వేసినట్లు తెలిపింది. ఈ కాయిన్లు ఇప్పటికీ అతడి వద్ద ఉన్నాయని, ప్రస్తుత మార్కెట్‌ ప్రకారం వాటి విలువ రూ.150 కోట్లకు పైనే ఉంటుందని వెల్లడించింది. ఈ క్రమంలోనే కేసు దర్యాప్తులో భాగంగా రాజ్‌కుంద్రా ఆస్తులను అటాచ్‌ చేసింది






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com