ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్యకు గురికావడంతో ముంబై అలర్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే బాబా సిద్ధిఖీ స్నేహితుడు, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒకసారి సల్మాన్ ఇంటి దగ్గర రెక్కీ నిర్వహించిన బిష్ణోయ్ గ్యాంగ్.. సల్మాన్‌కి గతంలోనూ వార్నింగ్ ఇచ్చింది.
ఇంతకీ ఏమైందంటే.. ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్యతో రాజకీయ వర్గాలతో పాటు సినీ వర్గాలు కూడా తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. సినీ ఇండస్ట్రీతో బాబా సంబంధాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సల్మాన్ కు ఆప్త మిత్రుడైన సిద్ధిఖీ ప్రతియేటా రంజాన్ పర్వదినాన గ్రాండ్ ఇఫ్తార్ పార్టీ నిర్వహిస్తారు. ఈ వేదికపై సల్మాన్, షారుఖ్ ఖాన్ లను కలిపిన ఘనత ఆయనకే చెందుతుంది. అలాంటిది ఆయన మరణ వార్త వినగానే సల్మాన్ బిగ్‌బాస్ షో షూటింగ్ మధ్య నుండే సిద్దిఖీ పార్థివదేహం వద్దకు చేరుకున్నారు.