బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఉదారతను చాటుకున్నాడు. దీపావళి కానుకగా అయోధ్యలోని వానరాల కోసం రూ.కోటి విరాళం ప్రకటించారు. అయోధ్య నగరంలో వానరాల పోషణ నిమిత్తం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ‘ఆంజనేయ సేవా ట్రస్ట్’ వారికి ఈ విరాళాన్ని అందజేయనున్నట్టు ఆయన తెలిపారు. తాను చేస్తున ఈ సేవ దివంగతులైన తన తల్లిదండ్రులు, తన మామ, బాలీవుడ్ వెటరన్ నటుడు రాజేశ్ ఖన్నాలకు అంకితం చేస్తున్నానని అక్షయ్ తెలిపారు. అంతేకాదు కోతుల ఆహారం కోసం ప్రత్యేకంగా ఒక ఫీడింగ్ వ్యాన్ ను కూడా అందజేశాడు. కాగా అయోధ్య వానరసేనకు అక్షయ్ కుమార్ ఆహారం పెట్టడం ఇదేమి మొదటిసారి కాదు. బాలరాముడి ఆలయ ప్రారంభమైనప్పటినుంచి ఈ మంచి పనికి శ్రీకారం చుట్టాడు అక్షయ్. అయోధ్యతో పాటు శివారులోని సురక్షిత ప్రాంతంలో దాదాపు 1,200 కోతులకు నిత్యం పౌష్ఠికాహారం అందిస్తున్నాడీ సీనియర్ హీరో.